E-PAPER

తపాస్ పల్లి పాఠశాలలో స్వయంపాలన దినోత్సవం.

Date : 11 March 2026, 7:55 pm Posted By : PRAJA GONTHUKA

తపాస్ పల్లి పాఠశాలలో స్వయంపాలన దినోత్సవం.

తపాస్ పల్లి పాఠశాలలో స్వయంపాలన దినోత్సవం.

ప్రజా గొంతుక కొమురవెల్లి : మండలంలోని తపాస్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారంరోజున "స్వయం పాలన దినోత్సవం" నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠశాలలో చదువుకుంటున్న 6, 7 వ తరగతులకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 7వ తరగతి విద్యార్థిని పూజిత డీఈఓగా, అక్షర ఎంఈఓగా, ఆరవ తరగతి విద్యార్థి శివ గణేష్ పాఠశాల హెడ్మాస్టర్ గా వ్యవహరించారు. మిగతా విద్యార్థులుఉత్సాహంగా విద్యను బోధించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ రోజూ పాఠాలు వినే తాము, స్వయం పాలన దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులుగా మారడం కొత్త అనుభూతి ఇచ్చిందని తెలిపారు. పాఠాలు చెప్పడం వెనక ఎంత శ్రమ దాగున్నదో,ఉపాధ్యాయులు ఎంత శ్రమిస్తారో తమకు తెలిసిందని అన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు వారికి జ్ఞాపికలను అందజేశారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా హరికృష్ణ నిలిచారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అష్రఫ్ అహ్మద్, ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి, లక్ష్మయ్య, మహేందర్ రెడ్డి, సర్పంచ్ పుట్ట కనకరాజు, కార్యదర్శి మురళీకృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు పుట్ట రమేష్, ఈగ కనకరాజు, చంద్రమౌళి, రమేష్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

తపాస్ పల్లి పాఠశాలలో స్వయంపాలన దినోత్సవం.

ప్రజా గొంతుక కొమురవెల్లి : మండలంలోని తపాస్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారంరోజున “స్వయం పాలన దినోత్సవం” నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠశాలలో చదువుకుంటున్న 6, 7 వ తరగతులకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 7వ తరగతి విద్యార్థిని పూజిత డీఈఓగా, అక్షర ఎంఈఓగా, ఆరవ తరగతి విద్యార్థి శివ గణేష్ పాఠశాల హెడ్మాస్టర్ గా వ్యవహరించారు. మిగతా విద్యార్థులుఉత్సాహంగా విద్యను బోధించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ రోజూ పాఠాలు వినే తాము, స్వయం పాలన దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులుగా మారడం కొత్త అనుభూతి ఇచ్చిందని తెలిపారు. పాఠాలు చెప్పడం వెనక ఎంత శ్రమ దాగున్నదో,ఉపాధ్యాయులు ఎంత శ్రమిస్తారో తమకు తెలిసిందని అన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు వారికి జ్ఞాపికలను అందజేశారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా హరికృష్ణ నిలిచారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అష్రఫ్ అహ్మద్, ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి, లక్ష్మయ్య, మహేందర్ రెడ్డి, సర్పంచ్ పుట్ట కనకరాజు, కార్యదర్శి మురళీకృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు పుట్ట రమేష్, ఈగ కనకరాజు, చంద్రమౌళి, రమేష్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్