వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలి..
*- ఖమ్మం జిల్లా బాధితులకు న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొన్న...*
*- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.*
*- ఎన్ హెచ్ పి ఎస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.*
జోగులాంబ గద్వాల జిల్లా లో ఖమ్మం జిల్లా వెలుగుమెట్ల లో పేదలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్లతో వారి నివాసాలు కూల్చేయడం అన్యా యమని, ఇళ్లను కూల్చినచోటే మరో కొత్త ఇళ్లను కట్టించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాల యంలో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ పాల్గొని పూర్తి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న న్యాయపోరాటానికి తాము అండగా ఉంటామన్నారు. ప్రజలపై ఎలాంటి చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పేదలని ఎంపిక చేసుకొని వారిపై బుల్డోజర్ల ప్రభుత్వం కొనసాగిస్తున్నారని ఇది ముమ్మాటికీ హేయమైన చర్య అని అన్నారు. హైదరాబాద్ నగరంలో పెద్దల యొక్క అక్రమ కట్టడాలను వదిలేసి పేదలపై వారి అధికార అహంకారాన్ని చూపించడం దారుణం అన్నారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ పోలీసు యంత్రం గాన్ని అడ్డం పెట్టుకుని పేదలపై జులుం ప్రదర్శించడం రాజ్యాంగానికి విరుద్ధ మన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులతో పాటు నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, మండల నాయకులు ప్రేమ్ రాజ్,ము నెప్ప, దొడ్డెన్న,అంజి, వెంకటేష్ తదిత రులు పాల్గొన్నారు.












