చింతల్ డివిజన్ లో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తాజా మాజీ కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ
*కుత్బుల్లాపూర్ మార్చ్ 11 ( ప్రజా గొంతుక )*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ కమిటీ హల్ మైదానం లో ఏరియా స్లమ్ సమైక్య అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిదిగా పాల్గొన్న తాజా మాజీ కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ.
ఈ సందర్బంగా మాట్లాడుతూ... మహిళలు స్వశక్తి తో ఎదగాలి స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి ఇతర మహిళలకు ఉపాధి కల్పించాలని కోరారు.
మహిళా ఎంటర్ప్రినర్ గా ఎదగడానికి మా సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయి అని అన్నారు.
ఈ కార్యక్రమం లో చింతల్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు స్వప్న, సీనియర్ నాయకురాలు చెన్నమ్మ, నాగరాణి, కవిత, ఇందిరా, స్వాతి, ప్రమీల, రాణి, మమతా, నిర్మల, జ్యోతి, శోభ, సుజాత, అంబిక తదితరులు పాల్గొన్నారు.












