పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి.
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్.
ప్రజా గొంతుక చేర్యాల : యుద్దాల సాకుతో కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరల పెంపును విరమించుకోవాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ బుధవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల పట్టణంలోని అంగడి బజార్ వద్ద జాతీయ రహదారిపై కాళీ గ్యాస్ సిలిండర్ తో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పన్నెండు సంవత్సరాల కాలంలో అనేకసార్లు వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి పేద, మధ్యతరగతి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ రూ.60వేల కోట్ల భారాన్ని దేశ ప్రజలపై వేయడాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారుఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న యుద్ధం పేరుతో చమురు నిల్వల కొరత ఉండనున్నదనే సాకుతో ధరలను పెంచారన్నారు. విశ్వగురువుగా చెప్పుకునే ప్రధాని మోదీ యుద్దాన్ని ఎందుకు ఆపలేకపోయారని దుయ్యబట్టారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల సహాయ కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, మహిళా సమాఖ్య నాయకురాలు సుంకోజు రజిత, డివిజన్ నాయకులు గూడెపు సుదర్శన్, బూరుగు సత్తయ్య, మల్లం అంజయ్య, గజ్జల సురేందర్, గూడెపు సంతోష, అందె యాదవ్వ, పద్మ, లచ్చవ్వ, రాములు, లచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.












