*విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందించిన సంఘ మోహన్ యాదవ్*
ప్రజా గొంతుక న్యూస్ రాయికల్
రిపోర్టర్ అనిల్ కుమార్
మార్చి 14వ తేదీ నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షల సందర్భంగా రామాజీపేట ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థుల పరీక్షలకు అవసరమయ్యే సామాగ్రిని పాఠశాల పూర్వ విద్యార్థి సంఘ మోహన్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహన్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిభతో మంచి పేరును పాఠశాలకు తీసుకురావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గజ్జేల నరేందర్, ఏఎంసీ చైర్మన్ యుద్ధం లక్ష్మి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రమేష్, విజయ్ కుమార్, కిరణ్, జయదేవ్ వర్మ, రమ, జ్యోతి, యశోద వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












