అభివృద్ధికి డికె.అరుణమ్మ ఎప్పుడు అడ్డు కాదు.
జూరాల సేఫ్టీ రోడ్డు కచ్చితంగా నిర్మించాల్సిందే .
డ్యాం సేఫ్టీ బ్రిడ్జి కట్టండి. ఆర్ బి ద్వారా కొత్తపల్లి దగ్గర బ్రిడ్జి కూడా కట్టండని సమావేశంలో తేల్చి చెప్పిన ఎంపీ డికె అరుణమ్మ డ్యాం సేఫ్టీ బ్రిడ్జి కట్టకపోతే జూరాల డ్యాం ఆయుష్యు తగ్గిపోతుంది.గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవే ళలా కృషిచేసి ప్రజల మన్ననలు పొందిన మహబూబ్‌నగర్ పార్లమెం ట్ సభ్యురాలు డీకే.అరుణమ్మ అ భివృద్ధికి అడ్డు కాదని ఎల్లవేళలా అభివృద్ధిని ఆకాంక్షిస్తారని జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు.మంగళవారం డీకే.బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ..
జల సౌధ లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో మహబూ బ్‌నగర్ ఎంపీ డీకే అరుణమ్మ హాజరై జూరాల సేఫ్టీ కొరకు రోడ్లు నిర్మించకుండా కొత్తపల్లి దగ్గర నిర్మించడం ఏమిటని ప్రశ్నించడం పట్ల కొందరు కాంగ్రెస్ నాయకులు అరుణమ్మ అభివృద్ధికి అడ్డుపడు తున్నదని ఆరోపించడం వారి మూ ర్ఖత్వానికి నిదర్శనం అని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి దగ్గర నిర్మిస్తే దరూర్ ఉప్పేరు నాగరదొడ్డి,గార్లపాడు చింతరే వుల, రేవులపల్లి లాంటి ,గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వారి త్యాగాలు వృధా కాబోవని తెలిపా రు. గతంలో డీకే అరుణమ్మ బ్రిడ్జికి రక్షణ కవచంగా బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదనలు చేయగా ఈనాడు మంజూరు లభించిందని అట్టి ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలని ఆదేశాలు ఉన్న అట్టి జీవోను మార్చి కొత్తపల్లి దగ్గర నిర్మించడా నికి ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు. ప్రస్తుతం నర్వా మక్తల్ నారాయణపేట్ తదితర ప్రాంతాలు అభివృద్ధి చెందాయంటే జూరాల బ్రిడ్జి దగ్గర సేఫ్టీ బ్రిడ్జి నిర్మిం చాలని అన్నారు.చేతనైతే ఆర్ అండ్ బి శాఖ ద్వారా కొత్తగా నిధులు మంజూరు చేయించి కొత్తపల్లి దగ్గర బ్రిడ్జి నిర్మించాలని జూరాల సేఫ్టీ కొరకు మంజూరైన బ్రిడ్జి ఇక్కడే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మకూరు, గద్వాల అభివృద్ధిలో జూరాల బ్రిడ్జి ఎంతో ప్రాముఖ్యత వహించిందని అట్టి దానిని మారిస్తే ప్రజలు ఊరు కోరని తెలిపారు. ప్రజలను తప్పు దోవ పట్టించే రీతిలో కొత్తపల్లి ప్రాం తంలో బ్రిడ్జి నిర్మిస్తే ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. నిన్న డీకే అరుణమ్మ పై అభివృద్ధి అడ్డుకుం టున్నదని ఆరోపించడం కాంగ్రెస్ నాయకులకు సరికాదని అన్నారు.మీ ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీ పథకాలు అమలు కావడం లేదని ధర్నా చేయండి రైతు భరోసా రాలేదని ధర్నా చేయండి కానీ అభివృద్ధిలో పాలుపంచుకున్న అరుణమ్మను విమర్శిస్తే ఊరుకోమని తెలిపారు. ర్యాలంపాడు ,గుడ్డెం దొడ్డి రిజర్వా యర్ల స్థాయి పెంచుతామని చెబు తున్న అది సాధ్యం కాదని అన్నా రు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశా ధికారి మిర్జాపురం రామచం ద్రారె డ్డి, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి,ధ రూర్ మండల అధ్యక్షుడు తిమ్మా రెడ్డి, చింతరేవుల సర్పంచ్ రాజేష్ అయ్యా,మండల ఎస్సి మోర్చా అధ్యక్షుడు ఆంజనేయులు, మండ ల నాయకులు హనుమంత రాయ,రామి రెడ్డి, శేఖర్ రెడ్డి, నరసింహ చారి , గార్లపాడు తిప్పన సత్తన్న తదితరులు ఉన్నారు.












