ఘనంగా కాంగ్రెస్ నాయకుడి జన్మదిన వేడుకలు...
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రంలో నక్క వాని గూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కన్రాజ్ రవీందర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గుర్రపు బాలరాజు,జిల్లా సందీప్,చెరుకూరి శ్రీనివాస్ లు కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొని శాలువలతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ప్రజా జీవితంలో ప్రజాసేవకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిమ్మ కరుణాకర్ రెడ్డి, దాచేపల్లి రాజయ్య, అవధూత శ్రీనివాస్, దేవరకొండ రమేష్, వేణు, అనిల్ రెడ్డి ,జంగిటి సిద్ధులు, కొండ హరికృష్ణ, బొట్టు గణపతి తదితరులు పాల్గొన్నారు.












