హైదరాబాద్ లో జరిగిన వరల్డ్ షోటో ఖాన్ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొన్న టైమ్ స్కూల్ విద్యార్ధులు.......
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి /షేక్ షాకీర్: హాలియా: మార్చి:10
ఆదివారం హైదరాబాద్ లో జరిగిన వరల్డ్ షోటో ఖాన్ ట్రైనింగ్ క్యాంపు జరిగింది.ఇందులో జపాన్ లో అంతర్ జాతీయ పతాక విజేత బ్లక్ బెల్ట్ హెచ్ క్యూ6 వ డాన్ శెట్టి సి చే ట్రయినింగ్ క్యాంప్ తెలంగాణ :ఆంధ్ర చీఫ్ ఇంచార్జ్ రాపోలు సుదర్శన్ మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ క్యాంప్ లో టైం స్కూల్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వీరిని టైం స్కూల్ డైరెక్టర్స్ మంద నరేందర్ రెడ్డి సార్, కత్తి కోటిరెడ్డి సార్ అభినందించడం జరిగింది. కరాటే అనేది ఆత్మ విశ్వాసాన్ని మనోధైర్యాన్ని పెంచుతుంది.అదే విధంగా ఈ రోజుల్లో అమ్మాయిలకు కరాటే చాలా అవసరం అని ఆయన తెలిపారు.బ్లాక్ బెల్ట్ 2వ డాన్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కే సైదులు మాస్టర్.,హాలియా తదితరులు పాల్గొన్నారు












