E-PAPER

నేడు విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల మహా ధర్నా 

Date : 10 March 2026, 8:12 am Posted By : PRAJA GONTHUKA

నేడు విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల మహా ధర్నా 

నేడు విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల మహా ధర్నా

ప్రజా గొంతుక ప్రతినిధి/జనగామ:

తెలంగాణ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ టీవీ ఏ ఈ జేఏసీ ఆధ్వర్యంలో మార్చి 10 న హైదరాబాద్ సెక్రటేరియట్ వద్ద ఉన్న టీజీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు భారీ నిరసన చేపట్టనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 23 వేల మంది ఆర్టిజన్ కార్మికులను ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ వర్తింపచేయాలని విద్యా అర్హత మేరకు కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మహాధర్నకు పిలుపునిచ్చారు.అన్ మ్యాన్డ్ కార్మికులు స్పాట్ బిల్లింగ్ పీస్ రేట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని జనగామ జిల్లా టివి ఏఈజెఏసి వైస్ చైర్మన్ రాగుల రమేష్ కోరారు.విద్యుత్ శాఖలో బ్రిటిష్ కాలం నాటి 1947 స్టాండింగ్ ఆర్డర్ రూల్స్ ను అమలు చేస్తూ కార్మికులను శ్రమ దోపిడికి గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అన్యాయాన్ని ప్రస్తుత ప్రజా ప్రభుత్వం సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి 23 వేల మంది కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపాలని కోరారు.ప్రభుత్వం స్పందించని పక్షంలో అదే రోజు సమ్మె నోటిస్ అంద చేస్తామని కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇట్టి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్