చలో గన్ పార్క్
* జోగు అంజన్న
చౌటుప్పల్ మార్చి 09 (ప్రజా గొంతుక)
ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని గన్ పార్క్ వద్దకు ఉదయము 10 గంటలకు ప్రారంభమయ్యే మిలియన్ మార్చ్ లో పాల్గొనాలని రాష్ట్రంలోని నలుమూలల నుండి 33 జిల్లాల ఉద్యమకారులంతా కలసి పాల్గొనాలని తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన చారిత్రాత్మక మిలియన్ మార్చ్ 10 మార్చ్ 2011 ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ కొరకు అమరులైన వారిని గుర్తు చేసుకు నే కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ ప్రభుత్వము మేనిఫెస్టోలో పొందుపరిచినట్టుగా ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీని వేసి గుర్తించి వారికి గుర్తింపు కార్డులను జారీ చేసి వారికి ఇస్తామన్న 250 గజాల ఇంటి స్థలాన్ని మరియు 25 వేల పెన్షన్ సౌకర్యాన్ని కల్పించి మా డిమాండ్స్ పదివేల కోట్లతో ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ట్రైన్లలో బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం తదనంతరం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా ఉద్యమకారునిలకు ఘనంగా సన్మానం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు శీలం స్వామి యాదాద్రి జిల్లా అధ్యక్షులు కళాకారుల సంఘం మల్లం వెంకన్న సీనియర్ ఉద్యమకారులు కొండూరు సత్తయ్య కన్నెగంటి శ్రీనివాసచారి పల్లెర్ల రామచంద్రం పారుపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు అని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న విలేకరుల సమావేశంలో తెలియజేశారు












