పంచాయతీరాజ్ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్ర పై వారికి అవగాహన కల్పించిన ఎంపీడీవో .
ప్రజా గొంతుక( మార్చి 9) కాల్వ శ్రీరాంపూర్ : పంచాయతీరాజ్ అభివృద్ధి గ్రామిణ శాఖ సూచనల మేరకు, మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు రెండో విడత శిక్షణ ఎంపీడీవో రామ్మోహనా చారి గ్రామపంచాయతీ సుపరిపాలన, స్థానిక సంస్థల బాధ్యతలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు, ఆర్థిక నిర్వహణ గ్రామ సభల నిర్వహణపై వార్డు సభ్యులకు అవగాహన కల్పించారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కార్యాలయంలోని రెండో విడత వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో ప్రారంభమయ్యాయి. ఎంపీడీవో రామ్మోహన చారి పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి, పారదర్శక పరిపాలన, పంచాయతీ రాజ్ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్ర పై అవగాహన కల్పించారు. ప్రభుత్వం శిక్షణ కార్యక్రమలు ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుద్ధంపై చర్యలు, సంక్షేమ పథకాల అమలు, నిధులు వినియోగంపై సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ శ్రీధర్, సీనియర్ సహాయకులు రంగు రవి, జూనియర్ అసిస్టెంటట్ భాగ్యలక్ష్మి, ట్రైనర్స్ సందీప్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.











