పాండవుల గుట్ట అక్రమార్కుల ధనదహనానికి కరిగిపోతుంది...
ప్రజా గొంతుక (మార్చి 9 )కాల్వ శ్రీరాంపూర్: పాండవుల గుట్ట అక్రమార్కుల ధన దహానికి కరిగిపోతుందని, రాత్రి, పగలు,అని తేడా లేకుండా అక్రమ మట్టి దోసుకపోతున్నారని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు.కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని పాండవుల గుట్ట నుండి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారని, పర్యావరణానికి హాని జరుగుతుందని సామాజిక కార్యకర్త,జాతీయ బీసీ సంఘం సమన్వయకర్త ఆకుల జిల్లా ఆధానపు కలెక్టర్ వేణు, తో పాటు మైనింగ్ ఏడి. శ్రీనివాస్ కు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో పాండవుల గుట్ట ప్రాంతం సుమారు 600 ఎకరాలు ఉండేదని,క్రమంగా తగ్గుతు 200 ఉంటుందాని, అంటున్నారని అక్రమార్కుల ధన దహనానికి పాండవుల గుట్ట కరిగిపోతుందని, సంబంధిత అధికారుల ఏలాంటి అనుమతులు లేకుండానే, పగలు రాత్రి అనే తేడా లేకుండా యదేచ్చగా మట్టిని తారలిస్తూ దోచుకుంటున్నారని, లారీలు, ట్రాక్టర్ల ద్వారా, అభివృద్ధి పేరుతో ప్రైవేట్ స్థలాలకు తరలించుకోని,సొమ్ము చేసుకుంటున్నారని, అక్రమంగా మట్టిని తరలించడం వలన ప్రభుత్వ ఆదాయానికి గడ్డి పడుతుందని, అక్రమార్కుల పై చర్యలు తీసుకోవాలని పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఆకుల పటేల్, తెలిపారు. అలాగే వారితో పాటు దాసరి నరేందర్ ఉన్నట్లు తెలిపారు.












