E-PAPER

హాలియా మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి….

Date : 09 March 2026, 7:41 pm Posted By : PRAJA GONTHUKA

హాలియా మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి….

హాలియా మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి....

మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/షేక్ షాకీర్: హాలియా: మార్చి:09

హాలియా మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి అధ్యక్షతన నేడు మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో మున్సిపాలిటీ పరిధిలో చేపట్టవలసిన వివిధ అభివృద్ధి పనులు, ప్రజలకు అందిస్తున్న మౌలిక వసతుల మెరుగుదల, పారిశుధ్య కార్యక్రమాలు, త్రాగునీటి సరఫరా, రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి పలు ముఖ్యమైన తీర్మానాలు ఆమోదించబడినవి.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి విచ్చేసి, మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మరియు నిధులను సమర్థవంతంగా వినియోగించుకుని పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, త్రాగునీరు మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి మున్సిపల్ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి , మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, వైస్ చైర్మన్ గౌనీ రాజా రమేష్ యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు 2 వ వార్డు కౌన్సిలర్ న నకిరేకంటి అన్నపూర్ణ, 4 వ వార్డు కౌన్సిలర్ కడమంచి ప్రమీల, 5 వ వార్డు కౌన్సిలర్ చిట్టిపోలు శ్రీదేవి, 6 వ వార్డు కౌన్సిలర్ బొంగరాల యేసు రాజు, 8 వ వార్డు కౌన్సిలర్ గౌహర్ జబీన్ 9 వ వార్డు కౌన్సిలర్ చెరుపల్లి ముత్యాలు 10 వ వార్డు కౌన్సిలర్ పిల్లి చంద్రకళ, 11 వ వార్డు కౌన్సిలర్ డి. ప్రసాద్ బాబు, 12 వ వార్డు కౌన్సిలర్ ఎడవల్లి మేరీ, హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాకునూరి నారాయణ గౌడ్ మరియు పట్టణ ప్రముఖులు మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతంగా అమలు చేయాలని మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని మున్సిపల్ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్