రాష్ట్రంలో ఏం జరుగుతుంది. కక్ష సాధింపువైపే జగన్ వెళుతున్నాడు,తెలుగుదేశాన్ని నామ రూపాల్లేకుండా చేయాలని జగన్ ఆలోచనంటూఅచ్చన్నాయుడి అరెస్టుతో టీడీపీ పెద్ద నాయకుల్లో కంగారు మొదలైంది.వాస్తవానికి తొలి ఏడాది పాలనలో జగన్ కేవలం ప్రజలకు సంక్షేమపథకాలు, యువతకు ఉపాధి అవకాశాలు ఏలా కల్పించాలన్నదానిపైనే ఎక్కువశ్రద్ధ చూపాడనే చెప్పాలి. జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండిఅవినీతి వ్యతిరేఖ మంత్రం పాటించాడు. వాస్తవానికి అది సమాజంలో అమలుకాకపోయినా, పార్టీ నేతలను, కేడర్‌ను అవినీతికి దూరం చేయడంలో జగన్ఒక్క అడుగు ముందుగానే ఉన్నాడు. ఇదే సందర్భంలో గత టీడీపీ ప్రభుత్వంఅవినీతి చేసిందంటూ వచ్చిన ఆరోపణల్ని జగన్ పెద్దగా పట్టించుకోలేదు.ఇందుకు కారణం ఆధారాలు పూర్తిగా లేకపోవడం. అందుకే అన్నిటికి వేచిచూసాడు. విచారణ లోతులో ఉన్న ముసుగులను బయటపెట్టడానికి తొలి ఏడాదివెచ్చించాడు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకోవడం ఆయన ముందుచూపుగానే చెప్పుకోవాలి. మొదటి ఏడాదిలో జగన్ టీడీపీ హయాంలో చేసినలోసుగుల ముసుగులను బయటపెట్టాలనుకున్న తగిన సమయం కోసం తొలి ఏడాదిలోజగన్ పాలన కేవలం ప్రజల వైపే మళ్ళించడం, జగన్ ఇక మనల్ని ఏంచేయలేడన్న ప్రచారంతో ప్రతిపక్షానికి బలం రెట్టింపైంది. టీడీపీనిఎవ్వరూ ఏం చేయలేరు.. ఏది చేసినా టీడీపీలో మేధావుల ముందు జగన్ తెలివిసరిపోదు అన్నట్టుగా టీడీపీ నాయకులు కేడర్‌లో బలం నింపడానికివిశ్వ ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేఖ ప్రచారం చేయడంలోప్రతిపక్షం ఒకరకంగా విజయం కూడా సాధించినంత పనిచేసింది.అనుభవజ్ఞలు ఎక్కువుగా ఉన్న పార్టీగా టీడీపీకి ముద్ర ఉండనే ఉంది.జగన్ ఏది చేసినా దానిలో తప్పులు వెతికి భూతద్దంలో చూపించేందుకురాత్రింబళ్లు టీడీపీ నాయకులు కష్టపడుతూనే ఉన్నారు. అనుభవంలేనితనంతో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సాధారణ జనానికి కొత్తగాఉండటంతో విమర్శల తాకిడి పెరిగింది. దీంతో టీడీపీకీ ఇప్పట్లో లేనిబలం పెరిగినట్లైయింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ అసహన గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నాడు. ఇసుక, మద్యం ధరల పెంపు, ఎన్నికల కమిషన్తలనొప్పితో ఒకరకంగా జగన్ మరింత ఉక్కరిబిక్కిరయ్యారనే చెప్పాలి.కరోనా ఎఫెక్ట్ తో ఆర్థిక స్థితిగతులు జగన్‌తో ఆడుకున్నాయి.కోర్టుకేసుల్లో ఏ తీర్పు కూడా జగన్ ప్రభుత్వ పాలనకు అనుకూలంగారాకపోవడంతో పాలన ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తాజగాపార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇసుక విధానంపై తిరుగుబాటు చేయడం వైసీపీనేతల్ని కలవరపెట్టింది. ఏలాగూ పసుపు మీడియాగా ముద్ర వేసుకున్న ఓవర్గం మీడియా పక్కగా టీడీపీకి కొమ్ము కాయడంతో ఏడాదిలోనే జగన్ పనైపోయిందనుకున్నారంతా. ఇదంతా ఇప్పటి వరకూ నడుస్తూ వచ్చింది. కానిజగన్ ఏడాది పాలన తరువాత తాజాగా ఆయన పాలన మొత్తం వెర్షన్ 2.0 కిమారిందనేది నమ్మదగిన సత్యం. ఉహించని రీతిలో టీడీపీ లో బలమైననాయకులకు రెడ్ కార్పెట్ పరచిన జగన్ ఆదిశగా మరింత మందినిపార్టీలోకి చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఒకరకంగాటీడీపీకి కోలుకోలేని దెబ్బ. ఇదిలా ఉండగానే ఏసీబీ చంద్రబాబు కుడిభుజంలా ఉన్న మాజీ మంత్రి కింజారపు అచ్చన్నాయడు ESI స్కాంలో అరెస్టుచేసింది. అచ్చన్నను ఆధారాలతో ఏసీబీ అరెస్టు చేయడం రాష్ట్రంలోకలకలం రేపింది. ఈప్రభావం టీడీపీ హై కేడర్‌లో ఉన్న అందరిపైనాపడిందనే చెప్పాలి. బీసీ నాయకుడిని అరెస్టు చేశారని ఆరోపిస్తున్నటీడీపీకి అచ్చన్నాయుడి అరెస్టు మైలేజీ కన్నా పెను ప్రమాద సూచికనుచూపిస్తుంది. టీడీపీ హయాంలో జరిగిన ప్రతీ పనిపైనా విచారణకు జగన్రంగం సిద్ధం చేసుకోవడంతో రెండవ ఎడాది పాలనలో జగన్ ప్రతిపక్షంపైనేఫోకస్ పెట్టాడనేది ఇప్పడంతా చర్చనీయాంశంజ. తీగ లాగితే డొంకకదిలినట్టు అచ్చన్నాయుడి వెనుక సూత్రధారులు వస్తే టీడీపీకి మరింతగడ్డు పరిస్థితి తప్పకపోవచ్చు. టీడీపీ నేతలు వచ్చేందుకు పార్టీగేట్లు తెరచిన జగన్ మొత్తం టీడీపీని ఖాళీ చేయించాలన్నలక్ష్యమా..లేక చంద్రబాబును ఒక్కడినే చేయాలనే సంకల్పమా అనేదిచర్చగా మారింది. టీడీపీలో బడా బాబులంతా చినబాబు జపం పాడటంతోదాదాపుగా అప్పట్లో జరిగిన డవలప్‌మెంట్ వెనుక నేతల డవలప్‌మెంట్పైనా జగన్ వర్గం కన్నేయడం , అవినీతి పై కూపీలు తీయడం టీడీపీనేతల్నిమరింతగా కలవరపెడుతుంది. ఏసీబీ చెబుతున్న మాటలు, కోర్టుకువారి చూపిస్తున్న ఆధారాలు అచ్చన్న కేసును ఏం మలుపుతిప్పుతుందనేదిటీడీపీని భయపెడుతోంది.రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఏసీబీనీబలోపేతం చేయడంతోపాటు, అవినీతికి వ్యతిరేఖంగా ఆది నుండి జగన్ దిశానిర్ధేశం చేస్తూనే ఉన్నారు. ఇప్పడు ESI లో మందుల కొనుగోళ్లువ్యవహారంలో, అచ్చన్నాయుడి అరెస్టు చూస్తుంటే జగన్ గేర్మార్చాడనేది సుస్పష్టంగా తెలుస్తోంది. మొన్నటి వరకూ రాష్ట్రఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ అంశంతో జగన్‌ను ఓ ఆట ఆడుకున్నటీడీపీకి జగన్ పాలనపై తీవ్రస్థాయిలో వ్యతిరేఖ పథకం రచిస్తున్ననేపథ్యంలో అచ్చన్నాయుడి అరెస్టుతో టీడీపీ నేతలకు మతిపోయినంతపనయ్యింది. ఇప్పడిప్పడే జగన్‌కు బ్రేక్‌లు వేసుకుంటూ వస్తున్నతరుణంలో అచ్చన్న అరెస్టుతో , ఏపీ రాజకీయాల్లో జగన్ వెర్షన్ 2.0మొదలైందనే చెప్పకోవచ్చు. అవినీతి ఆరోపణలు, విచారణలు పక్కనపెడితే టీడీపీపై జగన్ పెట్టిన ఫోకస్ తో ఇంకెన్ని మార్పులు ఉంటాయనేదిఓ ఏపిసోడ్‌లా మారితే అవినీతికి కెరాఫ్ జగన్ అంటూ ప్రచారం చేసిన వారుఏం చెబుతారో..












