అన్ని రంగాల్లో రాణిస్తున్న..నారీ లోకం.. ఆమె శక్తి అపారం.. ఆమె ఓ ప్రేరణ...
ప్రజా గొంతుక (మార్చి 8) కాల్వ శ్రీరాంపూర్ : అణిచివేత నుంచి..ఆత్మవిశ్వాసం వైపు.. ఆమె ప్రయాణం.. అవకాశాలే లేవన్నా చోట అకాశమే హద్దు గా రాణింపు.. అన్ని రంగాల్లో రాణిస్తున్న.. నారీ లోకం... అవకాశాలు అందిపుచ్చుకొని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మగవారి ప తీసిపోమని... తమ వృత్తిలో ప్రావీణ్యతను చాటుకుంటున్నారు. అమ్మల లాలించడమే కాదు, సమర్థవంతంగా వివిధ భాగాల్లో అధికారులుగా పాలించడంలోనూ తమదైన శైలిలో మహిళా మణులు ముందుకు వెళ్తున్నారు. పాలన రంగంలో మహిళలదే అగ్రస్థానంగా కనిపిస్తుంది. ఆమె శక్తి అపారం ఆమె ఓ ప్రేరణ.. ఆమె లేకుంటే సృష్టి లేదు, దానికి గమ్యం గమనం లేదు.. అందుకే ఆమెకు శతకోటి వందనాలు.. వంటగదికే ఆమెను అంకితం చేద్దామని.. చూస్తే అంతరిక్షంలో దూసుకెళ్లింది. అందుకే అంతర్జా తీయ సందర్భంగామహిళల సామాజిక, ఆర్థిక,సంస్కృతి, కుటుంబం కోసం అమ్మలుగా,మహిళా లు చేస్తున్న విశేష సేవలను గుర్తిస్త గౌరవిస్తూ వారిని శాలువాలతో సన్మానిస్తారు. ప్రతి మహిళలను గౌరవించాలి వారి త్యాగాలను గుర్తించాలి. మహిళల దినోత్సవం సందర్భంగా మండలంలోని ఆయా గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామ పాలన అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామంలోని మహిళలను సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. మండల కేంద్రంలోని వాసవి మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో వివిధ రకాల చార్ట్స్ ప్రదర్శించి, కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనం గా నిర్వహించారు. మహిళ దినోత్సవం ప్రాముఖ్యత గురించి మహిళలు ప్రసంగించారు.












