మార్చి7,8,9 తేదీలలో సాగరమాత ఉత్సవాలు.......
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:07
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో సాగర మాత మహోత్సవాలను ఈ నెల 7,8,9 తేదీలలో జరనున్నాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగర్ మాత దేవాలయానికి రాష్ట్రంలో ప్రత్యేకస్థానం ఉంది.
కోరికలు తీర్చే తల్లిగా సాగర్ మాత భక్తులు కొలుస్తారు. సాగర్ ఒడ్డున వెలిసిన మేరీమాతను సాగర్ మాత పేరుతో క్రైస్తవులతో పాటు హిందు - ముస్లిం మతాల వారి నీరాజనాలు సైతం అందుకుంటుంది.
దేశములోనే భారతీయ సంప్రదాయ రీతులతో నిర్మించిన తొలి క్రైస్తవమందిరంగా దీన్ని చెబుతారు. ధూప , దీప, నైవేధ్యాలు , కొబ్బరికాయలు కొట్టడం, అగర్ బత్తీలు వెలిగించడం, హారతి తలనీలాలు సమర్పించటం వంటి మొక్కులు చెల్లించుకొనే కార్యక్రమాలన్నీ పూర్తిగా హిందు పద్దతిలో జరిగే క్రైస్తవ అలయమిది.
భారతీయ సంప్రదాయలకు అనుగుణంగా మందిర నిర్మాణం, గోపురం పై విగ్రహ సంపద రూపదిద్దికున్నాయి.
మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో విచారణ గురువుగా పనిచేసిన మొదటి సైమన్ స్వామి ఈ దేవాలయం నిర్మాణానికి నడుంకట్టగా గుంటురు క్రైస్తవ పీఠాధిపతి బాలసౌరి అన్ని విధాల సహకరించారు .1976 ఫిబ్రవరి 10 వ తేదిన మందిర నిర్మాణానికి శంకుస్ధాపన జరుగగా, ఆ తరువాత సంభవించిన వరదలు, కరువు కాటకాల వల్ల మందిర నిర్మాణం ఆగింది. తరువాత సైమన్ స్వామి రెంటచింతల అడవి సంపద నుంచి ధన సహాయం పొంది సాగరమాత ఆలయం నిర్మాణం పూర్తి చేసారు . ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సాగరమాత పుణ్యక్షేత్రంలో విచారణ గురువుగా ఉన్న కే.సుందరరాజు, గుంటూరు క్రైస్ధవ పీఠాధిపతి బిషప్ గాలిబాలి సహకారంతో పాత మందిరానికి కుడివైపున చర్చినిర్మాణం చేపట్టారు. నూతన చర్చి నిర్మాణానికి 1994 మార్చి 31వ తేదిన శంకుస్థాపన జరుగగా, 1996 మార్చి 9 వ తేదిన బిషప్ గాలిబాలి చేతుల మీదగా ప్రారంభం అయింది. పాత మందిరం హిందు సంప్రదాయరీతిలో అలరారుచుండగా అందుకు భిన్నంగా నూతన చర్చినిర్మాణం పూర్తిగా క్రైస్తవ పద్దతిలో జరిగింది.
ఈ సాగర్ మాతా మహోత్సవాలకు సుమారు 2 లక్షల మంది పాల్గొంటారు












