అయిజ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా మార్చేందుకు 99 రోజుల పారిశుద్ధి కార్యక్రమానికి శ్రీకారం'ప్రజా పాలన
.జోగులాంబ గద్వాల జిల్లా మార్చి6
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గo అయిజ పట్టణంలో 99 రోజుల పారిశుద్ధి కార్యక్రమాన్ని నేడు ఘనంగా ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ సైదులు ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ , వైస్ చైర్మన్ నరసింహులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సందర్భంగా చైర్మన్ , కమిషనర్ , వైస్ చైర్మన్ , కౌన్సిలర్లు, మున్సిపాలిటీ సిబ్బంది చీపుర్లు పట్టుకొని పరిసరాలను శుభ్రపరిచి, పారిశుద్ధ్య అవగాహన కల్పించారు.మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ మాట్లాడుతూ, ప్రజా పాలనలో చేపట్టిన 99 రోజుల పారిశుద్ధి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసి, అన్ని వార్డుల్లో శుభ్రతా కార్యక్రమాలు నిరంతరం చేపట్టి, ఐజ పట్టణాన్ని పరిశుభ్రమైన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.ఐజ మున్సిపాలిటీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు, మేనేజర్, ఏఈ, టౌన్ ప్లానర్లు, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.













