*విధుల్లో నిర్లక్ష్యం...విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం*
*(ప్రజాగొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 06:)*
*తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరీ 25వ తేది 2026 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అయినాయి.లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించిన పరీక్షలు కాబట్టి రాష్ట్ర స్థాయి అధికారులు,ప్రతి జిల్లా నుంచి కలెక్టర్లు మరియు ఎస్పీలు మరియు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారులు ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలిస్తూ పరీక్షలు సజావుగా నిర్వహిస్తున్నారు*
*రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క పరీక్ష కేంద్రంలో నిర్లక్ష్యం వలన ఏదైనా పొరపాటు జరిగితే లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం చూపెడుతుంది*
*మహేశ్వరం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.ఈ రోజు పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు తీసుకోవడానికి మోడల్ స్కూల్ చీఫ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఇ.గోపి గారు పోలీస్ స్టేషనుకి రాకుండా పరీక్షా కేంద్రానికి ఉదయం 8.45 గంటలకు చేరుకోకుండా 10.15 లకు చేరుకున్నాడు.విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాలుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు మరియు తల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారు*
ఈ విషయంపై ఒక రిపోర్టర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గోపి గారికి ఫోన్ కాల్ చేసి అడగగా.. *ప్రిన్సిపాల్ నిర్లక్ష్యపు సమాధానం* లేట్ అయిన విషయం వాస్తవమే ఎగ్జామ్స్ సాఫీగా జరిగాయి పేపర్ స్టేట్మెంట్లలో మరి ఈ వార్త రాయొచ్చా అని అడగగా వేసుకోండి అని సమాధానం ఇచ్చాడు పోలీస్ స్టేషన్ కస్టర్డ్ నరసయ్యను ఫోన్ కాల్ చేసి అడగగా మేము రోజు లాగా బందోబస్తు వచ్చి 8:30 వరకు సెంటర్లో పేపర్స్ అందజేసి వెళ్లడం జరిగింది అని వివరణ ఇచ్చాడు
దీనిపై ఎవరి నిర్లక్ష్యం ఉంది ఒక రిపోర్టర్ కి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఏంటి దీని వెనకాల ఎవరి హస్తం ఉంది విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోవాలి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు*












