పేదవారి సొంతింటి కల నిజం చేస్తున్న ప్రజా ప్రభుత్వం.
ప్రజా గొంతుక చేర్యాల: మండల కేంద్రంలోని వీరన్న పేట గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా హాజరై నూతన గృహప్రవేశాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సొంత ఇల్లు అనేది పేదింటి కల, అలాంటి కలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎక్కడ రాజీలేకుండా ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తూ వారి ఇంటి పెద్ద కొడుకుగా ప్రజల మనసుల్లో చిరస్థానాన్ని సంపాదించుకున్నారని, రానున్న మరి కొద్ది రోజుల్లో మరిన్ని ఇందిరమ్మ ఇండ్లను పేదలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, జనగామ నియోజకవర్గంలోని ముఖ్యంగా చేర్యాల ప్రాంతానికి మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు తీసుకువస్తా అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మంజే మల్లేశం, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ రాకేష్ కృష్ణన్, సీనియర్ నాయకులు కాటం సంజీవయ్య,మాజీ సర్పంచి కొండపాక బిక్షపతి,గ్రామ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పెద్దింటి రాకేష్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు కొండాపురం మధు, పోకల పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.












