*బైరాగిగూడ పోతురాజు లింగానికి గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీరాములు అందెల*
*పోతురాజు లింగాన్ని నేలమట్టం చేసి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ముష్కరులను కఠినంగా శిక్షించాలి - శ్రీరాములు అందెల*
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 06:)*
మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం బైరాగిగూడ గ్రామంలో గత అనేక సంవత్సరాలుగా బోనాల సందర్భంగా పూజలు అందుకుంటున్న పురాతన పోతురాజు లింగాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసి నేలమట్టం చేసి, గుప్త నిధుల కోసం అక్రమ తవ్వకాలు చేపట్టిన ఘటన స్థానిక హిందూ సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ విషయాన్ని గ్రామ పెద్దలు *బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు* కి తెలియజేయగా వెంటనే స్పందించిన శ్రీరాములు ఉదయం హిందూ బంధువులు, గ్రామస్తులతో కలిసి బైరాగిగూడ గ్రామానికి చేరుకొని ధ్వంసమైన పోతురాజు లింగం స్థలాన్ని సందర్శించారు. అనంతరం గ్రామ పెద్దలతో కలిసి పోతురాజు లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దేవతలపై దాడులు చేయడం, ఆలయాలపై దుష్ప్రవర్తనలు చేయడం వంటి ఘటనలు పెరుగుతుండడం చాలా ఆందోళనకరమని అన్నారు. పోతురాజు లింగాన్ని ధ్వంసం చేసి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేయడం అత్యంత దారుణమైన చర్య అని ఆయన తీవ్రంగా ఖండించారు. హిందూ దేవాలయాలపై దాడులు చేసే ముష్కరులపై ప్రభుత్వం మరియు పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులను గుర్తించి చట్టపరంగా గట్టి శిక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు. హిందువుల విశ్వాసాలను, సంప్రదాయాలను ఎవరు అవమానించినా తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. బైరాగిగూడలోని పోతురాజు లింగానికి యథావిధిగా గ్రామస్తులు పూజలు చేసుకునేలా రక్షణ కల్పించాలని కందుకూరు సీఐ వెంకటేశ్వర్లుని కోరారు. అదేవిధంగా పోతురాజు లింగం స్థలాన్ని అభివృద్ధి చేసి ఆలయాన్ని పునర్నిర్మించేందుకు తాను వ్యక్తిగతంగా ముందుండి సహకరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, కందుకూరు మండల బిజెపి అధ్యక్షులు నిమ్మ అంజి రెడ్డి, బైరాగిగూడ గ్రామ సర్పంచ్ పల్స కృష్ణ, ఉపసర్పంచ్ ఎలిమినేటి సంజీవ, వార్డు సభ్యులు భగవంత్, మంజుల, నగేష్, లత జంగయ్య, వినోద, దేవేందర్ గౌడ్, కిరణ్, ఏ దేవేందర్, మాజీ ఉపసర్పంచ్ వెంకటేష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు శివ గౌడ్, నరేందర్ సురేందర్, అంజయ్య, మైసయ్య, శ్రీకాంత్, జంగయ్య, రవీందర్, బిజెపి సీనియర్ నాయకులు స సాద మల్లారెడ్డి, గంగాపురం అమరేందర్ రెడ్డి, మండల మాజీ అధ్యక్షులు అశోక్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌర ప్రభాకర్, కందుకూరు మండల సర్పంచులు, తుక్కుగూడ మాజీ కౌన్సిలర్లు, బడంగ్పేట్, మీర్పేట్, డివిజన్ల బిజెపి, బీజేవైఎం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












