హాలియా మున్సిపాలిటీ 8 వ వార్డులో ప్రజా పాలన పట్టణ ప్రణాళిక కార్యక్రమం.....
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా :మార్చి:06
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజా పాలన పట్టణ ప్రణాళిక ప్రోగ్రామ్ ను 8వ వార్డు కౌన్సిలర్ గౌహర్ జబీన్ మజహర్ మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది వార్డు సభ్యులతో కలిసి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రతిజ్ఞ చేసి పరిశుద్ధ పనులను చేపట్టడం జరిగింది ఇట్టి కార్యక్రమం తేదీ 06-03-2026 నుండి 15-03-2026 వరకు కార్యక్రమాలు ఉంటాయని వార్డులోని పారిశుద్ధ్య పనులు అన్నిటిని పూర్తి చేస్తామని వార్డు ప్రజలందరూ భాగస్వామిలై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి వార్డును పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియపరచడం జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో 8 వ వార్డు ఇంచార్జ్ రాధిక వెంకన్న సువర్ణ రాజు, కౌన్సిలర్ సలహాదారు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మజహర్ మొహియుద్దీన్ , కార్పెంటర్స్ యూనియన్ అధ్యక్షులు కతోజు ఎల్లయ్య చారి వార్డు ప్రజలు మహిళలు మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు పాల్గొనడం జరిగినది.












