అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన 6వ వార్డు కౌన్సిలర్.....
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా :మార్చి:06
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ లోని ఆరో వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక కౌన్సిలర్ బొంగరాల యేసు రాజు సందర్శించి అక్కడ ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారో రిజిస్టర్ చెక్ చేసి,పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు సరఫరా అవుతున్న, ఆహారం విషయాల గురించి మరియు పిల్లలకు వచ్చే ఆట వస్తువుల వివరాలు, అలాగే సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం రమణయ్య, మద్దిమడుగు కిషోర్, పల్లేటి ఈదయ, కొండేటి నరసింహ, గోపాల సూర్యచంద్ర, ఇరుగంటి శోభన్ తదితరులు పాల్గొన్నారు.












