E-PAPER

విద్యార్థులు లక్ష్యసాధన దిశగా కృషి చేయాలి

Date : 06 March 2026, 12:58 pm Posted By : PRAJA GONTHUKA

విద్యార్థులు లక్ష్యసాధన దిశగా కృషి చేయాలి

విద్యార్థులు లక్ష్యసాధన దిశగా కృషి చేయాలి

*ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి*

ప్రజా గొంతుక న్యూస్,(మార్చి 05)సూర్యాపేట:విద్యార్థులు లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి సూర్యాపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వైష్ణవి స్కూల్ యానివల్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోని ఇష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించినప్పుడే పిల్లలు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు. తల్లిదండ్రులు పిల్లలు ఇష్టపడే చదువునే ప్రోత్సహించాలని తెలిపారు. విద్యార్థులు పరీక్షలలో రాణించి మంచి మార్కులు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైష్ణవి స్కూల్ కరస్పాండెంట్ యాద కిరణ్, ప్రిన్సిపాల్ స్వప్న,కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి,నామ అరుణ,రాపర్తి శ్రీనివాస్, వివిధ స్కూల్లో కరస్పాండెంట్లు వెంకటేశ్వర్లు, హరి,శ్రీనివాస్, సతీష్,వనీల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దె బోయిన శ్రీనివాస్,పోలగాని బాలు గౌడ్, లక్షాది,రాచకొండ శ్రీనివాస్, రాజు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్