తిప్పర్తి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ – *బి. చంద్రశేఖర్...*
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:05
పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడి చదువు స్థాయిపై ప్రశ్నలు అడిగిన కలెక్టర్...
గత ఏడాది 563 మార్కులు సాధించిన విషయాన్ని గుర్తుచేసి, ఈసారి అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించిన కలెక్టర్..
పది మంది విద్యార్థినులు 563 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటామని ధైర్యంగా చెప్పడంతో అభినందించిన కలెక్టర్...
పరీక్షలకు భయపడకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచన...
హాస్టల్‌లో దోమల సమస్య, బెంచీలు, మూత్రశాలలు, ఇతర సౌకర్యాలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు...
హాస్టల్ మెనూ గురించి కూడా విచారించారు..
విద్యార్థినులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేశారు..
కలెక్టర్ వెంట మండల తహసిల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ తదితర అధికారులు పాల్గొన్నారు.











