E-PAPER

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ 

Date : 05 March 2026, 8:15 pm Posted By : PRAJA GONTHUKA

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ 

న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని బాధితుల్లో కలిగించాలి

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

(ప్రజా గొంతు తెలుగు దిన పత్రిక)

మార్చి /05)

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ రోజు ఉదయం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ కు ధర్మసాగర్ ఇన్స్ స్పెక్టర్ శ్రీధర్ రావు పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, ఆయా గ్రామాల్లోకి ప్రజల జీవన శైలి, పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా జరిగే నేరాలు, రౌడీ షీటర్లు, అనుమానితులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు, బీట్లు, పెట్రోలింగ్, రికార్డుల నిర్వహణ పై స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసులు, పెండింగ్ కేసులు, నిందితుల అరెస్ట్ కు సంబందించి రికార్డులను సీపీ పరిశీలించారు.

అనంతరం సీపీ మాట్లాడుతూ ఫిర్యాదులపై స్టేషన్ అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని, విధి నిర్వహణలో అలసత్వంతో వ్యవహరించకుండా విధులు నిర్వహించాలని, ముఖ్యంగా పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ ప్రజల అభిమానాన్ని పొందాలని సీపీ తెలియజేసారు. పోలీస్ కమిషనర్ వెంట సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తో పాటు, ఎస్. ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :