విద్యార్థులకు 10వ తరగతి భవిష్యత్తుకి తొలి మెట్టు .ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ టి .రవి
మేడిపల్లి మండలం
ప్రజా గొంతుక ప్రతినిధి
విద్యార్థులు లక్ష్యశుద్ధితో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆర్.విఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి పిలుపునిచ్చారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్,9వ డివిజన్ మేడిపల్లి , 10వ డివిజన్ పీర్జాదిగూడ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన పరీక్ష ప్యాడ్‌లతో పాటు పెన్నులు, పెన్సిల్స్, స్కేల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి తుంగతుర్తి రవి ప్రసంగిస్తూ పదో తరగతి అనేది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే తొలి మెట్టు అని, ఈ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని ఆయన తెలిపారు.పరీక్షల పట్ల భయం వీడి, పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు.
పేద విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆర్.వి ఫౌండేషన్ ద్వారా ఈ చిన్న సహాయం అందిస్తున్నామని, భవిష్యత్తులో విద్యార్థుల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధించి, తమ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ స్కూల్ ప్రధానోపాధ్యాయులు( ఎంఈఓ)శ్రీనివాస్ రెడ్డి, మేడిపల్లి ప్రధానోపాధ్యాయులు సత్య ప్రసాద్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహ్మద్ మజర్, నాగరాజు, బర్రె నాగరాజు, శరత్ గౌడ్, ప్రభంజన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.












