E-PAPER

వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు

Date : 03 March 2026, 8:10 pm Posted By : PRAJA GONTHUKA

వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు

వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు

/ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక /

మార్చి 03

హోలీ పండుగను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం ఉదయం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. బ్యాండ్ వాయిద్యాల మధ్య పోలీస్ అధికారులు, సిబ్బంది కమిషనర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐ పి యస్ గారిని అధికారులు, సిబ్బంది, మహిళలు, చిన్నారులు, రంగులతో ముంచెత్తారు. అనంతరం పోలీస్ కమిషనర్‌తో పాటు అధికారులు, సిబ్బంది పరస్పరం ఒకరికి ఒకరు రంగులు జల్లుకుంటూ పోలీస్ కమిషనర్ దంపతులతో పాటు అధికారులు, సిబ్బంది తీన్మార్, నాగిన్ డాన్స్ స్టెప్పులతో నృత్యాలు చేస్తూ సాంప్రదాయ పద్ధతిలో, ఆనందోత్సాహాల నడుమ హోలీ పండుగ వేడుకలను జరుపుకుంటూ అధికారులు, సిబ్బందికి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, హోలీ పండుగ సౌహార్దం, సోదరభావం మరియు ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శాంతి, సంతోషాలతో పండుగను జరుపుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, ఏ.ఎస్పీ శుభం, ట్రైనీ ఐపిఎస్ మనీషా నెహ్ర, అదనపు డీసీపీ సురేష్ కుమార్, శ్రీనివాస్ తో పాటు ఏసీపీ లు ఇన్స్ స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఆర్.ఎస్.ఐ లు ఇతర పోలీస్ సిబ్బంది పలువురు పోలీస్ పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్