మూల మలుపుల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని వైనం...తరచు ప్రమాదాల నిలయాలు...!!
ద్విచక్ర, వాహనలే ఎక్కువగా ప్రమాదాలు..
ప్రాణాలు పోతున్న పట్టించుకోని సంబదిత అధికారులు..
మండల కేంద్రం నుండి ఏ గ్రామాల వైపు వెళ్లిన అవే చెట్లపొదలు.
ప్రజా గొంతుక (మార్చి 03) కాల్వశ్రీరాంపూర్ : ప్రధాన రహదారులకు ఇరువైపులా ముళ్ళపోదులు,చెట్లు పెరిగిపోయాయి.. ఏపుకు పెరిగిన చెట్ల తో, ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. గడిచిన కొన్ని నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలకు ఏపుగా పెరిగిన చెట్ల పొదలే ప్రధానం కారణంగా మారాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అంటే అర్థం చేసుకోవచ్చు... రహదారులు వెంబడి తరచూ ప్రమాదాలు జరిగిన, ప్రజల ప్రాణాలు కోల్పోతున్న, పట్టించుకునే నాధుడే కరువయ్యారు. సంబంధించిన ఆర్ అండ్ బి అధికారులు...దారులవెంబడి కనబడకుండా పెరిగిన చెట్లను తొలగించక నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తురన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూలమాల ప్రమాద సూచిక బోర్డులు కొత్తలో ఉండేవి ఇప్పుడు కనుమరుగయ్యాయి... కొన్ని ప్రాంతాల్లో బోర్డ్ లపై చెట్లపొదలు కమ్మేశాయి..!! కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం నుండి మోట్లపల్లి, అలాగే ఇదులాపూర్ గ్రామాల వైపు వెళ్లే రహదారుల వెంబడి దట్టంగా చెట్లు పెరిగి,ప్రమాదాలకు నిలయంగా రహదారులు కనపడకుండా ఉన్నాయి. మూలమలుపుల వద్ద చెట్లవలన ప్రమాదాలు నిలయంగా మారాయి. అలాగే మండల కేంద్రం నుండి మల్యాల వైపు కూడా ఇదే పరిస్థితి నెలకొన్నాయి. ఇంకా ప్రాదనంగా పోలీస్ స్టేషన్ అతి సమయంలో మూల మలుపులు ఉన్నాయి.ఆ మూలల వద్ద చెట్లు ఎపుగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక కుండా ఉన్నాయి. వివిధ గ్రామాల నుండి బైకులు, ఆటోల పై మండల కేంద్రంకు తరుచు వెళ్తుతుంటారు. ఈ క్రమంలో ప్రధాన రోడ్డుకు ఇరువైపున చెట్లు పేరిగి రోడ్డును కమ్మేసినట్టుగా ఉండడంతో, ఆ మూలల వద్ద తరచు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా రాత్రి సమయంలో అయితే మరి ఇబ్బందికరంగా ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మండల కేంద్రంలోని సుల్తానాబాద్, పెద్దపల్లి వెళ్లే రహదారి వెంబడి కూడా మూలమలుపుల వద్ద పే రిగిన చెట్ల వలన అవతలి నుంచి వచ్చే వాహనాలు సరిగా కనబడు.. వాహనాలు కనిపించకపోవడంతో ప్రాణనష్టాలుసంభవిస్తున్నాయి..ఆర్ అండ్ బి రోడ్డుకు ఇరువైపులా చెట్టు పెరగడంతో, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో, పాటు రెండు వాహనాలు వెళ్లేదిని పరిస్థితి నెలకొంది,ఎదురుగా వచ్చే వాహనం వెళ్లేందుకు ప్రయత్నిస్తే ముళ్ళ కంపలు గురుకపోయే ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రోడ్డుకు ఇరువైపులా ప్రమాదబరితంగా పెరుగుతున్న చెట్లను, ఇప్పటికైనా సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు దృష్టి సారించి, రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను తొలగించాలని వాహనదారులు కోరుకుతున్నారు.













