గ్రామాలల్లో రింగు రింగు బిళ్ళ ఆట ముగిసింది...ఘనంగా కామ దాహన కార్యక్రమాలు.
ప్రజా గొంతుక (మార్చి 2) కాల్వ శ్రీరాంపూర్ :మండల కేంద్రంలోని ఆయా గ్రామాల్లో కామ దహన కార్యక్రమాలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కాముడు ఆట (జాజిరి) సంబరాలు తొమ్మిది రోజులపాటు జరుగుతాయి,ఆట కాముని దహనంతో ముగుస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి పథకంగా గ్రామాల్లోని ప్రధాన కూడలలో కట్టెలతో కామర దహనం చేసి, సాంప్రదాయ బద్దంగా హోలిని స్వాగతిస్తారు. " రింగు రింగు బిళ్ళ రూపాయి దండ పిల్లల ఆట "జాజిరి ముగియడంతో సోమవారం రాత్రి ఆట తో ముగియడం తో, పిల్లలు అంత ఒక వద్దకు చేరి, కోలలు పేర్చి, కామ దహన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ మంటల ద్వారా మనసులోని కోరికలు, దృశ్యశక్తులు (కామం ) నశిస్తాయని గ్రామాల్లో నమ్ముతారు.












