E-PAPER

ప్రారంభమైన బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శర్మ శతజయంతి ఉత్సవాలు.

Date : 01 March 2026, 10:51 am Posted By : PRAJA GONTHUKA

ప్రారంభమైన బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శర్మ శతజయంతి ఉత్సవాలు.

ప్రారంభమైన బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శర్మ శతజయంతి ఉత్సవాలు.

వారి కుమారులు మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో,

శివంపేట. ప్రజా గొంతుక న్యూస్,ఫిబ్రవరి 28 :

మెదక్ జిల్లా. శివంపేట మండల కేంద్రంలో బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శర్మ శతజయంతి ఉత్సవాలు ఫిబ్రవరి 28 మార్చ్ శనివారం రోజున సాయంత్రం 6 గంటలకు శోభాయాత్ర, ఏడు గంటలకు జ్యోతి ప్రకశనం,గురు వందనం, శాస్త్రి గారి రాజోపచార పూజలు కనుల పండుగగా జరిగాయి.మార్చి 1 ఆదివారం రోజున శ్రీ శాస్త్రి గారి శతజయంతి ఉత్సవాలను నిర్వహించడానికి వేదిక శివంపేట మండల కేంద్రంలోని శ్రీ భగలాముఖి శక్తిపీఠం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో, తెలంగాణ ప్రాంతం రాయదుర్గశాబ్దాల క్రితం వేద విద్యాపీఠాని స్థాపించి వేదశాస్త్ర పూర్వ వైభవానికి కృషిచేసిన మహానుభావులు మెదక్ జిల్లా శివంపేటలో శతజయంతి ఉత్సవాల అంకురార్పణ శాస్త్ర విశ్వనాథ శాస్త్రి శతజయంతి ఉత్సవాలు వారి జన్మస్థలమైన శివంపేట మండల కేంద్రంలోని శ్రీ బగలాముఖి శక్తిపీఠంలో ఘనంగా శనివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి.శిష్యులు, అభిమానులు,ప్రముఖులు, హాజరైన ఈ సభలో శాస్త్రీయని స్మరిస్తూ ఏడాది పొడవున ఉత్సవాల నిర్వహణకు కార్యచరణ రూపొందించారు. మార్చి1న ఈ కార్యక్రమం అఖండ దీపారాధన, గణపతి హోమం,గురు ప్రార్ధనతో పరారంభమై రుద్రాభిషేకం, సద్గురు ధ్యానం,గురుపాదుకపూజ,హారతి,మంత్రపుష్పం కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 10 గంటలకు శంఖద్వనితో శతజయంతి ఉత్సవ ఆరంభ సభ కార్యక్రమం మొదలైంది శాస్త్రి గారి శతజయంతి ఉత్సవ సంబరాల ప్రభావాన్ని దర్శనం శర్మ వివరించి శిష్య బృందంలో గొప్ప స్ఫూర్తిని కలిగించారు.శాస్త్రి గారి పుత్రులు శ్రీ బగలాముఖి శక్తిపీఠం అమ్మవారి ఉపాసకులు శాస్త్ర వెంకటేశ్వర శర్మ ఉత్సవాల కార్యచరణ ప్రకటిస్తూ విశ్వ వాసు నామ సంవత్సరంలో ప్రతి నెలకొక పర్యాయం ఆయా ప్రాంతాలలో నివసించే విద్యార్థులు జిల్లా ప్రధాన కేంద్రాలు పట్టణాలలో శతజయించి ఉత్సవాలు నిర్వహించాలని కోరారు.చివరి కార్యక్రమం హైదరాబాదు రవీంద్ర భారతిలో ఉత్సవ సమాప్తి కార్యక్రమంగా జరపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శాస్త్ర పురుషోత్తమ శర్మ,శాస్త్రుల రఘురామ శర్మ,పాలకుర్తి నరసింహ శర్మ,పురాణం మహేశ్వర శర్మ,గంగవరం ఆంజనేయ శర్మ,వేలేటి పశుపతి శర్మ,వేలేటి సిద్ధాంత రామ శర్మ గురువుగారి గొప్పదనం గురించి తెలిపారు.ఈ కార్యక్రమంలో కాసుల చంద్రశేఖర్ శర్మ గంగవరం రామశర్మ,శుక్ల యజుర్వేది పరశురామ శర్మ,యాదగిరిగుట్ట సత్యనారాయణ శర్మ,చంద్రమౌళి శర్మ,నాగరాజు శర్మ రమేష్ శర్మ శంకర శర్మ,మణికంఠ శర్మ,దేవి ప్రసాద్ దేవా దత్త శర్మ తదితరులు పాల్గొన్నారు.

శృంగేరి ఆస్థాన పండితుడిగా,

దేశంలోని ఎన్నో చోట్ల కార్యక్రమాలు చేపట్టిన విశ్వనాథ శాస్త్రిని శృంగేరి జగద్గురులు తన ఆస్థాన పండితుడిగా గౌరవించారు 1961లో అష్టా గ్రహి కూటమి సందర్భంగా హైదరాబాదులో పీలు కానాలో జరిగిన అతి రుద్రయాగంలో దేశంలోని పండితుల్లో చురుకుగా యజ్ఞ కార్యక్రమం నిర్వహించినందుకు విశ్వనాథ శాస్రిని గజారోహణ సత్కారం చేశారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఆయన అవార్డు అందుకున్నారు.మెదక్ మండల సాహిత్య పరిషత్ వీరిని అభినవ విద్యారణ్య బిరుదుతో సత్కరించింది 1985 మే 5న వీరు నిర్వాహర్యం చెందారు. నామ సహస్ర విష్ణు సహస్రనామాలకు శంకరభాష్యాన్ని అనుసరించి చేసిన పద్యనువాదం, రాజోపచార పూజ వ్యాసం, ఏడుపాయల దుర్గాభవాని సుప్రభాతం,ఏడుపాయల దుర్గ భవాని మహత్యం, రఘువంశం మొదటి మూడు స్వరాల పద్యం వాదం మండుకో విషయాన్ని ప్రధానమైన రచనలు.

వేద విద్యాపీఠం స్థాపన, అప్పట్లో దేశపాండ్యాలు దేశముకులు భూస్వాములు బ్రాహ్మణులను సేవకులుగా చూస్తూ ఉండడంతో బ్రాహ్మణులకు సమాజంలో సముచిత స్థానం కల్పించాలని కంకణం కట్టుకున్నారు.దానికి అనుగుణంగా వేద విద్య పీఠాన్ని పురోహిత బ్రాహ్మణ పరిషత్తును స్థాపించి పాఠశాలలు శిక్షణ తరగతులు నిర్వహించారు. పురోహిత్య మీమాసానే గ్రంథాన్ని ప్రచురించి పురోహితులు పురోహితం ప్రశస్నాన్ని చాటిచెప్పారు. 1972లో కొన్ని మాసాలు ఈశ్వరిపురం ఇస్మాయిల్ ఖాన్ పేటలో, మెదక్ లో,శివంపేటలో తమ ఇంట్లోనే పాఠశాలను నిర్వహించారు.వేదం సంస్కృతం స్మార్కంతో,పాటు ఆంగ్లభాష కూడా బోధించారు.ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు వేదం చదవడానికి అక్కడికి వచ్చేవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందేది. విశ్వనాథ శాస్త్రి కుమారులు కూడా పాఠశాలను కొంతకాలం నిర్వహించి మూసేశారు. అప్పటి ప్రధానులు లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ లతో ప్రశంస పత్రాలను అవార్డులను అందుకోవడం జరిగింది. తెలుగు భాషా పండితుడుగా, వేద బ్రాహ్మణుడిగా మండల,జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా కాకుండా వివిధ రాష్ట్రాలకు కూడా పేరు ప్రఖ్యాతలను గడించడంలో శ్రీశాస్తుల విశ్వనాథ శర్మకు సాటి లేరని చెప్పుకోవచ్చు. శనివారం రోజున జరిగిన పల్లకి సేవా కార్యక్రమంలో శివంపేట గ్రామ సర్పంచ్ రాజపేట వెంకటేశ్వర్, ఒప్పో సర్పంచ్ ఇసుగారి మల్లేష్, గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు, గ్రామస్తులు పెద్దలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్