ఘనంగా టైలర్ దినోత్సవ వేడుకలు.
శివంపేట.ప్రజా గొంతుక న్యూస్,ఫిబ్రవరి 28 :
మెదక్ జిల్లా. శివంపేట మండల కేంద్రంలోని టైలర్ యూనియన్ ఆధ్వర్యంలో టైలర్ దినోత్సవం సందర్భంగా టైలర్ సోదరులు ఒకచోట చేరుకొని కేక్ కటింగ్ చేసి టైలర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. టైలర్ రంగంలో తాము, నేర్చుకున్న నైపుణ్యం ద్వారా, సరికొత్త నూతన పద్ధతిలో బట్టలను టైలరింగ్ చేయడం, నేడు సమాజంలో ట్రెండు మాదిరిగా బట్టలను స్టిచ్చింగ్ చేసి తయారు చేయడంలో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు.ఈ కార్యక్రమంలో దావూద్, ఈసుగారి వెంకటేష్, పంబల బుమేష్, శేఖరప్ప తదితరులు పాల్గొన్నారు.












