-మార్చి 3న -శ్రీ స్వయంభూ శ్రీకృష్ణ స్వామి ఆలయం మూసివేత.
జోగులాంబ గద్వాల జిల్లా ఫిబ్రవరి 28
మార్చి 3న కేతు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని సద్ద లోనిపల్లి గ్రామంలో శ్రీ స్వయంభో శ్రీకృష్ణ స్వామిఆలయం మూసివేస్తున్నట్లు ఆల య అర్చకులు, ఈఓ పురందర్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణం రోజున ఉదయం 7:00 గంటలకు ఆలయాల తలుపులు మూసివేసి, భక్తులకు దర్శ నాలను నిలిపివేస్తారు. మార్చి 4న ఉదయం 9:00 గంటలకు మహా మంగళహారతితో ఆలయాలు తిరిగి తెరిచి, భక్తులకు దర్శనం కల్పిస్తా మని పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గ్రహించి సహకరించాలని కోరారు.












