E-PAPER

ప్రజెంటేషన్ స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

Date : 28 February 2026, 6:04 pm Posted By : PRAJA GONTHUKA

ప్రజెంటేషన్ స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

ప్రజెంటేషన్ స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

ప్రజా గొంతుక చేర్యాల: పట్టణంలోని ప్రజెంటేషన్ హైస్కూల్లో శనివారం రోజున జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చేర్యాల మున్సిపల్ చైర్మన్ ముస్త్యాల అరుణ బాల నరసయ్య,వైస్ చైర్మన్ మేడిశెట్టి ఉమా శ్రీధర్, కౌన్సిలర్ భూనాద్రి సురేష్, పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ ముస్త్యాల అరుణ బాల నరసయ్య, మాట్లాడుతూ పరిశోధనలే అత్యున్నత జీవన విధానానికి సోపానాలుగామారుతాయని,విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరు శాస్త్రీయ విజ్ఞానం పట్ల అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు అద్భుతంగా ఉన్నాయని వీరిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయ బృందానికి ప్రిన్సిపాల్ కు అభినందనలు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ జ్యోతి మాట్లాడుతూ మానవ మేథస్సుతోనే ఇంతటి ప్రగతి మనం సాధించగలిగమని, విద్యార్థులు గొప్ప పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు తెలుసుకోవాలని,నేడు సమాజంలో కలవర పెడుతున్న అనేక రుగ్మతల పట్ల దృష్టి సారించి వాటిని నిర్మూలించే దిశగా పరిశోధనలు చేయాలని పేర్కొన్నారు.ఈ సంవత్సరం నుండి క్లాస్ రూమ్ లో టీవీ స్క్రీన్లు ఏర్పాటు చేసి విద్యాబోధన చేస్తున్నామని పాఠశాల విద్యార్థులు క్రీడా పోటీల్లో జిల్లా స్థాయి,రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని స్కూలు ఆహ్లాదకరమైన వాతావరణం, విశాలమైన క్రీడా ప్రాంగణం, కలిగి ఉన్నదని అలాగే ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలతో వచ్చే విద్యా సంవత్సరం నుండి డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తున్నామని తెలిపారు.విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం మా ప్రజెంటేషన్ స్కూల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :