E-PAPER

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఘనంగా జాతీయ సైన్స్ డే దినోత్సవం వేడుకలు

Date : 28 February 2026, 6:02 pm Posted By : PRAJA GONTHUKA

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఘనంగా జాతీయ సైన్స్ డే దినోత్సవం వేడుకలు

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఘనంగా జాతీయ సైన్స్ డే దినోత్సవం వేడుకలు

ప్రజాగొంతుక న్యూస్ రాయికల్

రాయికల్ పట్టణం లో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో సైన్స్ డే ఘనంగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ జి శ్రీకాంత్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ ఎం సంతోష్ ముఖ్య అతిథులుగా పాల్గొని డాక్టర్ శ్రీకాంత్ రిబ్బన్ కత్తిరించి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. మరియు విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాలైన వర్కింగ్ మోడల్స్ సందర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తయారుచేసిన కొన్ని ప్రాజెక్టులు ప్రస్తుత సమాజంలో అవగాహనకు ఎంతో ఉపయోగమని ప్రశంసించారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జె తిరుపతిరావు మాట్లాడుతూ మనం ఈ సైన్స్ డే సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భంగా జరుపుకుంటాము అని, విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రయోగాలు వాటికి కావలిసిన సామగ్రి పాఠశాలలో ప్రత్యేకమైన ల్యాబ్ సౌకర్యం ఉండటం వారికి బోధించే విధానం విద్యార్థుల మేధ శక్తికి ఎంతో ఉపయోగపడింది అని భవిషత్ లో సైన్స్ అనేధి చాలా కీలకం అనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మూఢనమ్మకాల గురించి మరియు మన సోలార్ సిస్టం గురించి ప్రదర్శన రూపంలో తెలియజేశారు. ఈ రోజు జరిగిన ప్రయోగాలలో అధ్భుత మేధా శక్తి కనబర్చిన వారికి బహుమతుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ , జె మాధవి , డైరక్టర్ జె తిరుపతి రావు , ముఖ్య అథిదిగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మెడికల్ ఆఫీసర్ జి శ్రీకాంత్ , ల్యాబ్ టెక్నీషియన్ ఎం సంతోష్ ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు మరియు పోషకులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :