గ్రామం లో మనుషులంతా ఒకటే అనే విధంగా ముందుకు వెళ్తున్నాం సర్పంచ్ జ్యోతి.
ప్రజా గొంతుక (ఫిబ్రవరి 28 )కాల్వ శ్రీరాంపూర్: మానవులంతా ఒకటే అనే విధంగా ముందుకు వెళుతున్నాం,సమాజంలో ఎవరి హక్కులకు భంగం కలిగించొద్దని సర్పంచ్ రేకుల జ్యోతి రఘు, జిపిఓ ఎండీ అన్వర్ అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించరు.గ్రామంలో కుల వివక్ష,సోదర భావంతో మెలుగుతున్నామని, మానవులంతా ఒక్కటే అనే విధంగా ముందుకు వెళ్తామని తెలిపారు. గ్రామంలో ఎలాంటి కులవివక్ష అనే మాటలు రాకుండా, అంతా ఒకటే అనే విధంగా కలిసిమెలిసి ఉంటామని సర్పంచ్ అన్నారు. పౌర హక్కుల పై ప్రజలు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని రెవిన్యూ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మేడి అశోక్ గౌడ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి షాబుద్దీన్,హెల్త్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు మిర్యాల మల్లేష్ చిక్కుల వంశీ ఆశా వర్కర్లు సుమ, శైలజ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.












