సమాజంలో విజ్ఞాన శాస్త్రం లేకుండా జీవించడం చాలా కష్టం...
ప్రజ గొంతుక (ప్రిబ్రవరి) కాల్వ శ్రీరాంపూర్: విద్యార్థులు ప్రతి విషయాన్ని ఆలోచించాలని చేర్మెన్ ఆయాజ్, సిఈఓ సయ్యద్ అన్నారు.మండలం ఇప్పలపల్లి గ్రామ పరిధిలో గల క్రిసెంట్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తో ఘనంగా విజ్ఞాన ప్రదర్శననిర్వహించారు.ఈ ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నాయి. రైతులకు సేంద్రీయ ఎరువులు ఎలా ఉపయోగించాలో ప్రదర్శించారు.పర్యావరణాన్ని ఎలాకాపాడాలి,,వ్యవసాయాన్ని తక్కువ ఖర్చుతో కుడిన వ్యవసాయ మార్గాల గురించి విద్యార్థులు ప్రదర్శించారు. కిడ్నీలు,ఉపిరి తిత్తులు పనితీరు వంటి నమూనాలు విద్యార్థులు స్వయంగా తయారు చేసుకొని వచ్చి ప్రదర్శించారు. పీరియడ్ క్రాంక్ స్టిములేటర్, లైఫై,కార్బన్ ప్యూరీఫయర్, టెస్లా కాఇల్,మైక్రో స్కోప్,గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, ఆరోగ్యం,అనారోగ్యానికి సంబంధించిన ఆహార పదార్థాలు,క్విజ్ బోర్డు, మైండ్ కాన్సెంట్రేషన్ గేమ్, చంద్రయాన్..3 వంటి నమూనాలు ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి క్రిసెంట్ పాఠశాలల చైర్మన్ సయ్యద్ వజహతుల్లా అయాజ్,సీ ఈవో సయ్యద్ తహబిలాల్,ఎండి జమీరుద్దీన్ పాల్గొన్ని మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి విషయాన్ని సృజనాత్మకంగా ఆలోచించాలని, పలు రకాల కొత్త విషయాల పట్ల ఆసక్తిని సూచించలని అన్నారు. భవిష్యత్తులో మీరు కూడా గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగి జీవితంలో స్థిరపడాలన్నారు. ప్రస్తుత సమాజంలో విజ్ఞాన శాస్త్రం లేకుండా జీవించడం చాలా కష్టం అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జాఫర్, వైస్ ప్రిన్సిపల్ షరీఫ్, ఫర్జానా, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.












