*జిల్లా కలెక్టర్ రాహుల్ బదిలీ*
**రెండు ఏండ్లలో మెదక్ జిల్లా సమాగ్రాభివృద్ధికి భివృద్ధికి ఎంతో కృషి చేశారు*
*ప్రజాగొంతుక (మెదక్ ప్రతినిధి ఫిబ్రవరి 26 )*
అనేక శాఖలో సమూల మార్పులు సంతరించుకునెల పని చేశారు
సమర్థవంతమైన పాలనతో అటు ప్రజా ప్రతినిధులను ఇటు జిల్లా అధికారులు, జిల్లా ప్రజల ప్రశంసలు పొందారు
పేద ప్రజలకు విద్య, వైద్యం, సంక్షేమ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూనే..అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా, పకడ్బందిగా సమర్థవంతమైన పాలనను అందించి తనదైన ముద్ర వేసుకున్నారు.
మెదక్ జిల్లా కలెక్టర్ గా రాహుల్ రాజ్ ఆన్ డ్యూటీ 24x7
2025 సం:లో సుమారుగా 300 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేశారు.
కలెక్టర్ గా మెదక్ జిల్లాలో కీలక మార్పులు తీసుకొచ్చారు
విద్యలో( ఎస్ఎస్సి) ఫలితాల్లో లో 93 నుంచి 97 శాతం ఉత్తీర్ణత పెంచారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లను ప్రోత్సహించారు.
జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది సమయ పాలన పాటిస్తూ విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ 2024లో 350 మరణాలు నమోదు అయితే 2025లో వాటిని 287కు తగ్గించడం
అన్ని సమీక్షలు నిర్వహించి ప్రమాదాల నివారణకు కృషి చేశారు.
ఈ ఆపీసు, ప్లాస్టిక్ నిషేధం,పేపర్ లెస్ లాంటి వినూత్న కార్యక్రమాల అమలకు శ్రీకారం చుట్టారు.
భూ భారతి దరఖాస్తులను పెద్ద ఎత్తున పరిష్కరించారు.
(దాదాపు 10,000 దరఖాస్తులను శాశ్వతంగా పరిష్కరించారు. )
వివిధ పైల్స్ ను ఈ ఆఫీసులో 2,500 పెండింగ్ ఫైలును పరిష్కరించారు.
విద్యా శాఖలో. లో గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేశారు.
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు విద్యా, వైద్యమే ఊపిరి..పేద ప్రజలే ఆయన అతిధులు
పాఠశాల కెళ్ళి విద్యార్థులకు పాఠం చెప్పడం ఆయన నైజం
విద్యార్థుల్లో సైన్సు గణిత సామర్థ్యాలను పెంపొందించి వారిలోని సృజనత్మాకత ను వెలికి తీసిన గురువు జిల్లా కలెక్టర్
రాత్రి పగలు లేవు..సెలవు రోజు లేవు, పండుగ రోజులు లేవు ప్రతి రోజు పాఠశాలకు వెళ్ళాలనే సంకల్పంతో విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి పాఠాలు బోధించి వారి సందేహాలను నివృత్తి చేసిన కలేక్టర్ గా పేరుతెచ్చుకున్నారు.
వైద్య రంగంలో ఆయనది డిఫరెంట్ స్టైల్
కవిగా పాటలు రాసి జిల్లా ప్రజల మన్నలను పొందారు











