పేదరిక నిర్మూలన సంస్థ మెప్మ ఆధ్వర్యంలో టౌన్ లెవెల్ ఫెడరేషన్ సమావేశం........
మున్సిపల్ కమిషనర్,
హాలియా పురపాలక సంఘం.
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:26
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా పురపాలక సంఘ కార్యాలయంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మ ఆధ్వర్యంలో టౌన్ లెవెల్ ఫెడరేషన్ సమావేశం గురువారం నిర్వహించబడింది. పట్టణంలోని స్వయం సహాయక సంఘాల బలోపేతం, స్ట్రీట్ వెండర్ల ఆర్థిక అభివృద్ధి మరియు ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హాలియా మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ, హాలియా పట్టణంలో ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు స్ట్రీట్ వెండర్లకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పి ఎం స్వనిధి పి ఎం సవ్ నిధి పథకం ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రుణాలు అందేలా మెప్మా సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పట్టణంలోని చిన్న వ్యాపారుల ఆర్థిక స్థితి మెరుగుపడేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసం మాట్లాడుతూ, ఇప్పటికే రుణాలు పొందిన లబ్ధిదారులు సకాలంలో రుణాలను చెల్లిస్తే తదుపరి దశల్లో అధిక మొత్తంలో రుణాలు పొందే అవకాశం కలుగుతుందని వివరించారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచి మరింత మంది లబ్ధిదారులను చేర్చాలని సూచించారు.
మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, హాలియా పట్టణంలోని వివిధ స్వయం సహాయక సంఘాలలో ఉన్న సభ్యులను గుర్తించి వారికి అనుకూలమైన రంగాలలో నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టణ పేదల ఆర్థిక స్వావలంబనకు మెప్మా కార్యక్రమాలు కీలకమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చింతల చంద్రారెడ్డి, వైస్ చైర్‌పర్సన్ గౌని రాజా రమేష్ యాదవ్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసం, మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీనివాస రెడ్డి , డి.ఎం.సి శ్రీ శివాజీ , టి.ఎం.సి శ్రీమతి పద్మ, రిసోర్స్ పర్సన్స్ మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.













