తండాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
(ప్రజా గొంతుక న్యూస్ )
ఫిబ్రవరి /25
గతంలో తండాలను ఎవరూ పట్టించుకోలేదు
నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతే మండలంలోని అన్ని తండాలకు 30కోట్లతో బిటీ రోడ్లు వేశాను
ఇంకా కొన్ని తండాలకు రోడ్లు వేయాల్సి ఉంది అవి కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయి
గోవర్ధనగిరి నుండి లోక్య తండా వరకు 12కోట్లతో నిర్మించిన బిటీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నేను ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాతనే రఘునాథపల్లి మండలంలోని అన్ని తండాలకు 30కోట్లతో బిటీ రోడ్లు వేశానని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు తెలిపారు
రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి జాతీయ రహదారి నుండి లోక్య తండా వరకు గిరిజన శాఖ ద్వారా 12కోట్లతో నిర్మించిన బిటీ రోడ్డును ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ప్రారంభించారు. ముందుగా జాతీయ రహదారి వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం యాపలగడ్డ తండా వద్ద ప్రారంబొత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ
గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏనాడూ తండాలను పట్టించుకోలేదని తెలిపారు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే అయిన తర్వాతనే తండాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. చేతకాని వారు, పని చేయని వారు చాలా మాటలు మాట్లాడుతారని పని చేసే వారు తక్కువ మాట్లాడతారని అన్నారు. యాపలగడ్డ తండా, చర్ల తండా, సేవాలాల్ తండాలకు రిజర్వాయర్ ద్వారా ఇబ్బంది అవుతుందని త్వరలోనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ద్వారా సత్యనారాయణపురం వద్ద ఇండ్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వాన్ని కోరుతానని తెలిపారు. మండలంలో ఇంకా కొన్ని తండాలకు రోడ్లు వేయాల్సి ఉందని, అవి కూడా మంజూరు అయి టెండర్ దశలో ఉన్నాయని త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయాని వెల్లడించారు. కూసుంబాయి తండా రోడ్డు నుండి యాపలగడ్డ తండా వరకు రోడ్డు మరియు బ్రిడ్జ్ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. యాపలగడ్డ తండా గ్రామానికి రెండో విడతలో 20ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని, అలాగే మండలంలోని అన్ని తండా గ్రామ పంచాయితీలకు 15 లక్షల సిసి రోడ్లు, డ్రైనేజిలు చేస్తానని హామీ ఇచ్చారు. యాపలగడ్డ తండా గ్రామ పంచాయతీ భవనానికి, పాఠశాలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తానని తెలిపారు. తండాల అభివృద్ధి కోసం పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, స్థానిక సర్పంచ్ గుగులోత్ మోతిలాల్ ఇతర గ్రామాల సర్పంచులు, గిరిజన శాఖ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు













