సాటి మనిషిని అదుకునే మనస్థత్వమే మానవత్వం.......
అమీర్అలి ఫౌండేషన్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:25
రోడ్డు ప్రమాదం లో గాయపడి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబానికి అమీర్ అలి ఫౌండేషన్ చేయూతగా నెల రోజుల కిరాణ సరుకులు బియ్యం కూరగాయలు అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు హాలియా మున్సిపాలిటీ 8 వార్డు కౌన్సిలర్ సలహాదారు మజహార్ మొయినోద్దిన్ మాట్లాడుతూ తాపీ పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకునె దినసరి కూలి రోడ్డు యాక్సిడెంట్ కి గురై త్రీవ గాయాలకి గురయి గత కొంతకాలంగా మంచానికే పరిమితం కావడం బాధాకరం తన కుటుంబ పోషణ భారంగా మారింది
మానవత్వంతో సృందించి ఎవరైనా దాతలు ముందుకు రావాలని తనకి సహాయం చేసేందుకు విజ్ఞప్తి చేస్తూన్న జబ్బార్ కి మనం ఉన్నామనే ధైర్యం ఇద్దాంచిరు సహాయం చేద్దాం అని కోరారు అమీర్ అలి ఫౌండేషన్ సభ్యులు ఖాజ మైనుద్దిన్ మాట్లాడుతూ శ్రమ మన ఆయుధం సేవా మన లక్ష్యం అనే నినాదంతో నిరుపేదలకి చేయూత ఇవ్వడంలో ఫౌండేషన్ సభ్యులు ఎప్పుడు ముందుంటారని సాటీ మనిషికీ సహాయం చేసే గొప్ప ఆవకాశం అందరికి దొరకదని సేవారంగంలో ఉండే సంతృప్తి గొప్పదని అన్నారు ఈ కార్యక్రమం లో అమీర్ అలి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమీర్ అలి గఫార్ కోటీ తదితరులు పాల్గొన్నారు












