*నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.*
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్ ) , 25 ఫిబ్రవరి 2026.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో 25 ఫిబ్రవరి 2026 నుండి జరగబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఉండాలని కొత్తగూడ ఎస్సై రాజ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని , ఎవరు కూడా గుంపులు గుంపులుగా ఉండకూడదని నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.











