ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.....బి. చంద్రశేఖర్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:25
నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు
పరీక్షలు రాస్తున్న విద్యార్థులను పరిశీలించి
విద్యార్థుల హాజరు, టాయిలెట్స్, తాగునీరు, క్లాక్ రూమ్, ప్రశ్న పత్రాలు, ఆన్సర్ షీట్ల డిపాజిట్, వివరాలు ఈజిలేటర్ని అడిగి తెలుసుకున్నారు..
విద్యార్థులు వారి వెంట తీసుకువచ్చిన పుస్తకాలు, మొబైల్ ఫోన్లు, వాచ్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటిని భద్రపరచుకునేందుకు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద తప్పనిసరిగా క్లాక్ రూమ్ ఏర్పాటు చేయాలని పునరుద్గటించారు.
అలాగే అన్ని పరీక్ష కేంద్రాలలో తాగునీటితోపాటు, విద్యార్థులకు టాయిలెట్ సౌకర్యం కల్పించాలన్నారు.
పోలీస్ స్టేషన్లో నుంచి క్వశ్చన్ పేపర్లను జాగ్రత్తగా బందోబస్తుతోపాటు తీసుకురావాలని, అలాగే ఆన్సర్ సీట్లు సైతం పోలీస్ భద్రతతో డిపాజిట్ చేయాలని చెప్పారు.
ఇంటర్ పరీక్షల సందర్భంగా జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగడానికి వీలులేదని, అంతేకాక విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్నారు.
పరీక్షలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18004251442 నంబర్ కు ఫోన్ చేసి తెలియజేయవచ్చు












