ఇంటర్ విద్యార్థులకు విజయశుభాకాంక్షలు
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి – నార్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆనేగౌని శ్రీకాంత్ గౌడ్
శంషాబాద్, ఫిబ్రవరి 24(ప్రజా గొంతుక)
రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా రంగారెడ్డి జిల్లా విద్యార్థులకు నార్సింగ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆనేగౌని శ్రీకాంత్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. పరీక్షలను భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని, ఏకాగ్రతతో చదివిన విషయాలను స్పష్టంగా రాయాలని సూచించారు. లక్ష్యంతో కృషి చేస్తే విజయం ఖాయం అవుతుందని అన్నారు.
రంగారెడ్డి జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని, తమ తల్లిదండ్రులకు, జిల్లాకు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశయాలను గౌరవిస్తూ క్రమశిక్షణతో పరీక్షలు పూర్తి చేయాలని హితవు పలికారు.మండల అధికారులు, పరీక్షా కేంద్రాల నిర్వాహకులు విద్యార్థులకు తాగునీరు, సరిపడా వెలుతురు తదితర కనీస వసతులు కల్పించి పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.












