గుండెపోటు తో ఆకాల మరణం చెందిన రాయనబోయిన సైదులు కుటుంబాన్ని పరామర్శించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్,
హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:24
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం
గుర్రంపోడ్ మండలం బోడపాడు గ్రామానికి చెందిన రాయనబోయిన సైదులు కొద్ది రోజుల క్రింతం గుండెపోటు తో ఆకాల మరణం చెందినారు అట్టి విషయం గ్రామ పెద్దల ద్వారా తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పి వారి కూతురు శీరీష బి ఎస్సీ హార్టికల్చర్ చదువుతూ చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూన్న తెలుసుకొని తనకి చదువు విషయం లో భరోసాగా ఉంటానాని, చదువు పూర్తియిన తర్వాత అగ్రికల్చర్ కోర్స్ మీద ఉద్యోగం ఇప్పించే భాధ్యత తనది అని హామీ ఇచ్చి,ఆర్ధిక సహాయాన్ని అందించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్
ఈ కార్యక్రమంలో గనిపల్లి సర్పంచ్ గుడారి మల్లిక -వెంకటేశ్వర్లు యాదవ్, మండల నాయకులు,కాంటెస్టెడ్ సర్పంచ్ కట్టెబోయిన మల్లేష్ యాదవ్, కొట్టే శ్రీను, కట్టెబోయిన సైదులు, చింతల శంకర్,రాయనబోయిన రాములు, సత్తయ్య, మన్నెం కోటి, రావుల రాము యాదవ్,మోకారాల అనిల్, చింత్లచెర్ల వెంకన్న,మునినాయక్ తదితరులు పాల్గొన్నారు.











