రాజేష్ ని కలిసిన షెడ్యూల్ కులాల సేవా సంఘం సీనియర్ సభ్యులు
ఉప్పల్ ప్రజా గొంతుక ప్రతినిధి
ఉప్పల్ డివిజన్లోని చిలకనగర్ డివిజన్ షెడ్యూల్ కులాల సేవా సంఘంసీనియర్ సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఇటీవలనే ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందమల్ల పరమేశ్వర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోచేరడం జరిగినది.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిలకనగర్
డివిజన్ కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు ములకలపల్లి రాజేష్ ముదిరాజ్ ని స్నేహపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ములకలపల్లి రాజేష్ ఆధ్వర్యంలో ముందు ముందు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని రానున్న ఎలక్షన్ లో రాజేష్ వెంట ఉండిఅందరు ఆయన వెంట నడుస్తామనిహామీ ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా వారి కష్టసుఖాల్లో కాలుపంచుకుంటూ ఎల్లవేళలా వాడికి తోడునీడగా ఉంటానని హామీ ఇస్తున్నానని అన్నారుఇంకా ఈ కార్యక్రమంలో కోండ్ర రాములు, పల్నాటి డేవిడ్, కోరెల్లి యాదగిరి ,రామ్ చర్ల బలరాం ,పొడి శెట్టి కృష్ణ మారపాక సాయిలు ,పడిగం రామ్ నరసయ్య, చింతల కొమురయ్య, జరిపోతుల చంద్రయ్య, వజ్జల ఆంజనేయులు ,రామకృష్ణ
మారపాక నాగయ్య ,యాదగిరి కొండ్ర కనకరాజు ,హరీష్, స్వామి ,పరశురాం,నరేష్ కూసుకుంట్ల రవి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు












