*తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తె.*
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 24 ఫిబ్రవరి 2026.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడ గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఎంచగూడ గ్రామానికి చెందిన గుజ్జ కమలాకర్ మేడారానికి వెళ్తున్న క్రమంలో , బైక్ అదుపుతప్పి కింద పడడంతో , తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. తండ్రి తన కూతురికి వివాహం చేసి , మహాలక్ష్మి లాగా వెళ్లాలని కోరుకుంటాడు. కానీ వీధి ఆడిన వింత నాటకంలో , తన కూతురే తండ్రికి కొరివి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సన్నివేశాన్ని చూసిన ఊరు ఊరంతా శోక సముద్రంలో మునిగిపోయారు.












