E-PAPER

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు – వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐ పి యస్ 

Date : 24 February 2026, 1:24 pm Posted By : PRAJA GONTHUKA

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు – వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐ పి యస్ 

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు – వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐ పి యస్

ప్రజా గొంతుక డెస్క్

(ఫిబ్రవరి =24)

ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణ లో భాగంగా సెక్షన్ 163 BNSS (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు తెలిపారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 94 పరీక్ష కేంద్రాల్లో (హన్మకొండ 52, వరంగల్ 24, జనగామ 16) తేది 25-02-2026 నుండి 18-03-2026 వరకు ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ తెలిపారు.

1. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదు.

2. సభలు, సమావేశాలు, ర్యాలీ లు, ధర్నాలు నిషేధం.

3. పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు తేది 25-02-2026 నుండి 18-03-2026 వరకు ప్రతిరోజూ ఉదయం 06:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు మూసివేయాలని సీపీ ఆదేశించారు.

ఎవరైనా ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని సీపీ హెచ్చరించారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్