చిన్నారి మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
బీసీలపై అగ్రకులాల దాడులు ఇంకెన్నాళ్లు
టిఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ యాదవ్
టిఆర్పి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ
ప్రజా గొంతుక న్యూస్,(ఫిబ్రవరి 23)సూర్యాపేట: నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతరలో చాకలి కులస్తులపై దాడి, రెండు నెలల చిన్నారి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిఆర్పీ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే విగ్రహం నుంచి కొత్త బస్టాండ్ వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. అగ్రకుల దురంకారం నశించాలని, బీసీలపై అగ్రకుల దాడులు ఇంకెన్నాళ్ళాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరగడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు దశాబ్దాలకు పైగా తక్కువ శాతం ఉన్న అగ్రకులాలకు అధికారాన్ని అప్పగిస్తే బహుజన కులాల పై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ప్రభుత్వం స్పందించి రజక కులస్తుల పై దాడి కి పాల్పడిన వారితో పాటు చిన్నారి మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టిఆర్పీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా కార్యదర్శి మీర్ అక్బర్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు చాంద్ పాషా, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల గౌడ్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏశబోయిన మల్లేష్ యాదవ్, సూర్యాపేట మండల అధ్యక్షుడు సోమ గాని లింగస్వామి గౌడ్, ఆత్మకూరు ఎస్ మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య యాదవ్, యెగ్గడి మురళి, మామిడి శోభన్, తగుళ్ల జనార్ధన్, భారీ అశోక్, వీరబోయిన లింగయ్య యాదవ్, నేలచెర్ల మధు ప్రజాపతి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లమల్ల నరసింహ, టిఆర్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు












