నిడమనూరు గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం కోసం నీటి ట్యాంకర్ ఏర్పాటు.....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:23
నల్గొండ జిల్లా నిడమానూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ సంధ్య శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యకులు కొంచం సతీష్,ఆధ్వర్యంలో, మార్కెట్ డైరెక్టర్ మన్నెం శంకర్ సమన్వయంతో, వార్డు సభ్యుల సహకారంతో కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తల సమక్షంలో గ్రామ ప్రజల అవసరాల దృష్ట్యా నీటి ట్యాంకర్‌ను ప్రారంభించడం జరిగింది.
గ్రామాభివృద్ధి మరియు ప్రజాసేవలో మరో ముందడుగు వేస్తూ, నిడమనూరు గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.












