E-PAPER

భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి.

Date : 22 February 2026, 7:14 pm Posted By : PRAJA GONTHUKA

భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి.

భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి.

ప్రజా గొంతుక కొమురవెల్లి : డబ్బుచప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, భక్తుల జయజయ ద్వానాలతో మల్లన్న నామస్మరణతో కొమురవెల్లి గుట్టలు ప్రతిధ్వనించాయి.ప్రముఖశైవక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామికి ఆదివారం కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మల్లన్నకు పట్నాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.అలాగే బోనాలు కూడా సమర్పిస్తారు. అనంతరం ఎల్లమ్మకు, మల్లన్నకు మట్టి పాత్రలో బోనం సమర్పించడం ఆనవాయితీగా చేయడం. పచ్చ రంగులతో పట్నంను సమర్పించి అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయ ప్రాంగణంలో గంగరేణి చెట్టు వద్ద భక్తులు, యాదవ పూజారులచే పంచవర్ణాలతో పట్నాలు వేసి మొక్కులు గా తీర్చుకున్నారు. స్వామి వారి ధర్మదర్శనానికి 2 గంటల సమయం పడుతుందని శీఘ్రదర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని ఆలయ వర్గాలు తెలిపాయి. ఆదివారం కావటం తో స్వామివారిని సుమారు 20 వేలకు మందిపైగా దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్